బెజ్జూరులో పెద్దపులి కలకలం

బెజ్జూరు: కొమరం భీం జిల్లాలోని బెజ్జూరు మండలంలో పెద్దపులి కలకలం రేపుతోంది. పంట చేలకు వెళ్లిన రైతుకు పెద్దపులి కంటపడటంతో హుటాహుటిన వచ్చిన రైతు గ్రామస్తులకు తెలిపాడు. బెజ్జూరులోని ఎల్లారం పోచమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని రైతు తెలిపాడు. పులి భయంతో అక్కడున్న ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు అటవీ అధికారులకు సమాచారాన్ని అందించారు.