బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌

జనగామ: సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ వెళ్తున్న దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్ ‌(2791) జ‌న‌గామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో బోగీలతో ఇంజిన్ విడిపోయింది. స్థానికంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రైల్వే పనులు నడుస్తుండడంతో మంగళవారం దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ 30 కి.మీ వేగంతో వెళ్తున్నది. ఈ క్రమంలో రైల్వే గేటు వద్ద బోగీల నుంచి విడిపోయి 250 మీటర్లు దూరం ఇంజిన్‌ వెళ్లిపోయింది. కాగా ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.