బోరుబావిలో పడిపోయిన బాలుడు

లక్నో: యుపిలోని మహోబా జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనలో పడిపోయిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ దళాలు, ఆరోగ్య, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తూ అధికారులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ధనేంద్ర ఆడుకుంటూ సుమారు 25-30 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయాడని పోలీసు అధికారి అనుప్ కుమార్ దుబే చెప్పారు.