బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: కోత్త మిస్సైల్ పరీక్షలను భారత్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. నూతన మిస్సైల్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్‌ను నేలపై ఎటాక్ చేసేందుకు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను మంగళవారం అండమాన్-నికోబార్ దీవులలో విజవంతంగా నిర్వహించింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఈ పరీక్షను ప్రారంభించామని, మిస్సైల్ విజయవంతంగా తన లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు తెలిపారు. డీఆర్డీఓ తయారు చేసిన మిస్సైల్‌ను భారత ఆర్మీ నికోబార్ దీవుల్లో పరీక్షించారు. ఈ మిస్సైల్ రేంజ్ దాదాపు 400 కిలోమీటర్ల వరకూ లక్ష్య ఛేదన ఉందని అధికారులు తెలిపారు. అయితే డీఆర్డీఓ తయారు చేసిన మిస్సైల్ తయారు చేసిన మిస్సైల్ ప్రస్తుతం ప్రపంచంలోనే తన స్థాయి మిస్సైల్‌లలో అత్యంత వేగవంతమైందని తెలిపింది. అంతేకాకుండా దానిని రేంజ్‌ను కూడా డీఆర్డీఓ ఈ మిస్సైల్ రేంజ్‌ను 298 కిలోమీటర్ల దూరం నుంచి 450 కిలోమీటర్ల దూరానికి పెంచింది. గత రెండు నెలల్లో డీఆర్డీఓ తన కొత్తవి వాటితో పాటుగా ఇప్పటికే ఉన్న మిస్సైల్లను పరీక్షించడంలో విజయవంతంగా పూరి చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రూస్ మిస్సైల్లను ఎగుమతి చేసేందుకు డీఆర్‌డీలో సిద్దమవుతుంది.