బ‌స్సు లోయ‌లో ప‌డి 8 మంది దుర్మ‌ర‌ణం

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో తీసా సబ్‌ డివిజన్‌ వద్ద బుధ‌వారం ప్రైవేటు బస్సు లోయలో ప‌డి 8 మంది మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విష‌యం తెలుసుకున్నాక పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.