భారత ప్రయాణికులకు న్యూజిలాండ్ నిషేధం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకుతమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. ఏప్రిల్ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత ప్రయాణికులతో పాటు న్యూజిలాండ్ పౌరులపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.