భార్య కాళ్లు, చేతులు నరికేశాడు

శ్రీకాళహస్తి: ఆలిని కాపాడాల్సిన భ‌ర్తే కాల‌య‌ముడయ్యాడు…. భార్య శీలాన్ని శంకించిన భ‌ర్తే ఈ కిరాత‌కానిక ఒడిగ‌ట్టాడు. ఈ ఘోరమైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. కాళ‌హ‌స్తికి చెందిన భార్య దుర్గను భర్త వెంకటేష్ ముందుగా కత్తి తో తీవ్రంగా దాడి చేసి ఆ త‌ర్వాత కాళ్ళు, చేతులు నరికేశాడు. దాడి అనంత‌రం నేరుగా పోలీసు స్టేష‌నుకు వెళ్లి లొగిపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ ఆరు నెలల క్రితం నెల్లూరు కు చెందిన దుర్గ ను వివాహం చేసుకున్నాడు. త‌ర‌చూ గొడ‌వ‌లు పడుతుండేవారు.. అలాగే అనుమానం పెనుబూతంగా మ‌రి.. భార్య ప్రవర్తన మీద వెంకటేష్ విప‌రీతంగా అనుమానం పెంచుకున్నాడు. ఇది ఇద్దరి మధ్య తీవ్ర గొడవల‌కు దారితీసింది. దాంతో రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తి తో దాడి చేశాడు. అనంతరం నేరుగా శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ దుర్గ ప్రస్తుతం నెల్లూరు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.