భార‌త్‌తో చ‌ర్చ‌లు సాధ్యం కావు: పాక్ విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో భార‌త్‌తో చర్చ‌లు సాధ్యం కావ‌ని అన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మ‌హ‌మూద్ ఖురేషీ. అన‌ధికారికంగాగానీ, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లుగానీ సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితులు లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ముల్తాన్‌లో బుధవారం మీడియాలో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ద డాన్ ప‌త్రిక వెల్ల‌డించింది. ఇటు ఇండియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. చ‌ర్చ‌లు, ఉగ్ర‌వాదం క‌లిసి వెళ్ల‌లేవ‌ని చెబుతూ వ‌స్తోంది. 2016లో ప‌ఠాన్‌కోట్‌లో దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దిగ‌జారిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పుల్వామా దాడి, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్తంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.