భార‌త్‌లో పెరుగుతున్న కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో గ‌త రెండు రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కేసులు తగ్గుతూవ‌చ్చాయి. గత రెండు రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 107 మంది మృతి చెందారు. ఈ మేర‌కు కేంద్రం గురువారం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,90,183కి చేరింది. ఇందులో 1,04,80,455 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,55,025 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి ర‌కు భార‌త్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,54,703కి చేరిందని బులిటెన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ కొత్త‌గా 177 కరోనా కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ‌లో 177 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగా తాజాగా క‌రోనా వైర‌స్ తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా 198 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,95,101 కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,91,510 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు క‌రోనాతో పారాడి 1,606 మంది మృతిచెందార‌ని బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.