భార‌త్‌లో 8.50శాత‌మే యాక్టివ్ కేసులు

24 గంటల్లో దేశంలో 50,129 కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కానీ రిక‌వ‌రీ రేటు మాత్రం పెరుగుతుండ‌టం ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. దేశంలో గడిచిన 24గంటల్లో 50,129 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 78,64,811కి చేరాయి. మరో 578 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,18,534కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో 62,077 మంది రోగులు వైరస్‌ నుంచి కోలుకున్నార‌ని ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మహమ్మారి ప్రారంభం నుంచి 70,78,123 మంది కోలుకోగా.. రికవరీ రేటు 89.9 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,68,154 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో శనివారం ఒకే రోజు 11,40,905 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 10,25,23,469 నమూనాలను పరిశీలించిన వివరించింది. దాదాపు 90% మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మొత్తం కేసుల్లో 8.50 శాతం మాత్ర‌మే యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.