భ‌ద్రాద్రి: గోదావరిలో యువకుడు గల్లంతు

భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్ర స్నానఘట్టాల వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి యువకుడు గల్లంతయ్యారు. మణుగూర్‌కు చెందిన మోతుకూరి సురేశ్‌ అనే యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం దైవదర్శనానికి వచ్చారు. కాగా అందరూ స్నానం చేసేందుకు స్నాన ఘట్టాల వద్ద నదిలో దిగారు. నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉండటంతో సురేశ్‌తోపాటు మరో ఇద్దరు నదిలో గల్లంతయ్యారు. వీరిలో స్థానికులు ఇద్దరిని రక్షించగా సురేశ్‌ను కాపాడలేకపోయారు. గల్లంతైన యువకుడి కోసం అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.