మంచిర్యాల‌: ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కిన వ్యక్తి..

మంచిర్యాల: ప‌ట్ట‌ణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైకి ఎక్కి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానిక హ‌మాలివాడుకు చెందిన పుసుపులేటి శేఖ‌ర్‌.. ఇంట్లో భార్యభర్తల గొడవల వ‌ల్ల కుటుంబంలో ఇబ్బ‌బందులు ప‌డుతున్నామ‌ని పోలీసులు సహకరించాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసిన‌ట్లు తెలిసింది. స్థానికులు చెప్పిన స‌మాచారం మేర‌కు.. తన భార్యకు, తనకు మధ్య మనస్పర్ధలు, ఎప్పుడూ గొడవలు జరగడంతో పసుపులేటి శేఖర్ ప్రభుత్వాసుపత్రి పైకి కిందికి దూకుతానని బెదిరింపు పాల్పడ్డాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తి తో వ్యవహరించి.. శేఖర్ భార్య ఫోన్లో మాట్లాడుతుందని చెప్తూ మాట‌ల్లోకి దింపాడు.. ఈ క్ర‌మంలో “నీతో నీ భార్య మాట్లాడుతది అంటూ“.. మాటల్లో పెట్టి కిందికి లాగేసాడు. అనంతరం పోలీసులు బాధితుడు శేఖర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు స‌మ‌య‌స్ఫూర్తితో శేఖ‌ర్‌ను ఆసుప‌త్రి భ‌వ‌నంపై నుండి కిందికి దింప‌డంతో గంటపాటు హైరానాపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.