మంచిర్యాల‌: ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. జిల్లాలోని హాజీపూర్‌ మండలం ముల్కల గ్రామ శివారు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ట్రాక్ట‌ర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో మహిళకు తీవ్రగాయాలుకాగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం మంచిర్యాల దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.