మంచిర్యాల‌: ట్రీ గార్డ్స్ కొనుగోళ్ల‌లో భారీ అవినీతి?

మంచిర్యాల‌: మంచిర్యాల జిల్లాలో ట్రీగార్డ్స్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మున్సిపాలిటీలు, పంచాయతీల్లో టెండర్లు లేకుండా రూ.3 కోట్లకు పైగా విలువైన ట్రీగాలు కొన్నారని తెలిసింది. డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ) పర్మిషన్ పేరిట ఓ జిల్లా ఆఫీసర్ దగ్గరి వ్యక్తులకు చెందిన సంస్థకు భారీ మొత్తంలో లాభం చేకూర్చినట్టు తెలుస్తోంది. కంప్యూటర్ సర్వీసులు అందించే సంస్థ ట్రీగార్డ్స్ సప్లై చేయడం ఈ గోల్‌మాల్‌లో చ‌ర్చ‌నీయాంశం. ఈ ట్రీగార్డ్స్ కోనుగోళ్ల గోల్‌మాల్ ఆరోప‌ణ‌ల‌పై జిల్లా అంత‌ట చర్చించుకుంటాన్నారు.

Leave A Reply

Your email address will not be published.