మంత్రి హ‌రీశ్‌రావు క్రిస్మ‌స్ కానుక‌ల పంపిణీ

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని స్థానిక కొండ భూదేవి ఫంక్షన్ హాల్‌లో క్రిస్మస్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్రిస్మస్ సంబురాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ల‌బ్దిదారుల‌కు మంత్రి క్రిస్మ‌స్ కానుక‌ల‌ను అంద‌జేశారు.

రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చిననాటి నుంచే టీఆర్‌ఎస్‌ సర్కారు అన్ని మతాలను సమానంగా గౌర‌విస్తూ ఆయా వ‌ర్గాల‌ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్‌ మైనార్టీల్లోని పేదలకు ఒక చీరె, జాకెట్‌, ప్యాంట్‌, షర్ట్‌తోపాటు చుడీదార్‌తో కూడిన ఒక కిట్‌ను అందజేస్తున్నది.
ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.