మందులతో ఆరు అడుగుల దుర్గాదేవి విగ్రహం
దిస్పూర్: క్యాప్సూల్స్, ఇంజక్సన్ వయల్స్‌తో దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించాడు ఓ కళాకారుడు. దాంతో ఆ కళాకారుడి పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శరన్నవరాత్రులను పురస్కరించుకుని అసోంలోని దుబ్రికి చెందిన సంజీబ్ బసక్ తయారు చేసిన అందమైన విగ్రహమే అందుకు కారణం. అమ్మవారి విగ్రహాన్ని చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అసోంలోని దుబ్రికి చెందిన సంజీబ్ కాలం చెల్లిన మందులు, క్యాప్సూల్స్, ఇంజక్సన్ వయల్స్‌తో ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించాడు. కరోనా పోరులో ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా కాలం చెల్లిన మందుల స్ట్రిప్‌లు, ఇంజెక్షన్ వయల్స్‌తో 6 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. ఈ విగ్రహం కోసం 60 రోజులపాటు రాత్రనక, పగలనక కష్టపడి రూపొందించాడు. ఇందుకోసం మొత్తం 30 వేల క్యాప్సూల్స్, సిరంజిలు ఉపయోగించాడు. సోషల్ మీడియాలో సంజీబ్ తయారు చేసిన విగ్రహం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.