మరో 12 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు 2020 ఏడాదిలో ప్రపంచ పేదరికం అసాధారణ స్థాయిలో పెరిగిపోయిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. గత 20 ఏళ్లుగా పేదరిక నిర్మూలన కోసం చేసిన ప్రయత్నాలను నీరుగారేలా కరోనా చేసిందని అభిప్రాయపడింది. తాజాగా మరో 11.9 కోట్ల నుంచి 12.4 కోట్ల మంది నిరు పేదరికంలోకి వెళ్లనున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి దాకా దాదాపు నూరు కొట్ల మంది పేదరికం నుచి బయటపడ్డారని, ఈ కరోనా విజృంభించడంతో పేదరికం పెరిగిపోతోందని పేర్కొంది. గత అక్టోబర్‌లో 8.8 కోట్ల నుంచి 11.5 కోట్లుగా ఉన్న ఈ అంచనా.. తాజాగా జనవరి లెక్కల ప్రకారం మరింత పెరిగినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.