మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ మూడు, అసోసియేట్ ప్రొఫెసర్ నాలుగు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనాటమీ, ఈఎన్టీ, అనెస్థీషియా, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయోగ్నోసిస్, పల్మనాలజీ, డీవీఎల్, జనరల్ సర్జరీ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపారు. దరఖాస్తులకు గురువారం గడువు తేదని, ఈ నెల ఎనిమిదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.