మహారాష్ట్రలో కొత్త‌గా 2,771 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కి పైగా కరోనా మర­ణాలు సంభ­వి­స్తు­న్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,771 కరోనా కేసులు, 56 మర­ణాలు నమో­ద­య్యాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం మర­ణాల సంఖ్య 51,000కు చేరింది. మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు చేరింది. మరో­వైపు గత 24 గంటల్లో 2,613 మంది కరోనా బారినుండి కోలు­కుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,25,800కు చేరి­నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,147 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్ల­డిం­చింది.

Leave A Reply

Your email address will not be published.