మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

హైదరాబాద్‌ :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ (75) కన్నుమూశారు. గత కొద్దికాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిశారు గుండా మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.  ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. గుండా మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంప‌ల్లికి త‌ర‌లిస్తారు.

అంచ‌లంచెలుగా ఎదిగిన మ‌ల్లేష్..

కాగా.. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మంచిర్యాల‌ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకుని.. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా కూడా వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.