మాజీ డిజిపి ప్రసాద్‌రావు కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి ప్రసాద్‌రావు కన్నుమూశారు. అర్ధరాత్రి 1 గంటలకు అమెరికాలో ప్రసాద్ రావు తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన ఛాతి నెప్పితో బాధపడుతున్న ప్రసాద్ రావును కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ప్రసాద్ రావు మృతిచెందారు.
ప్రసాదరావు స్వస్థలం ఎపిలోని విజయవాడ. 1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా, విశాఖ ఎస్పీ, హైదరాబాద్ కమిషనర్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ సేవలందించారు. ఆయన సేవలకుగాను 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు. ఆయన వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకం రాశారు.
ప్రసాదరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.