మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారినపడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐయిమ్స్)లో చేరారు. 88 ఏండ్ల మన్మోహన్ సింగ్ ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.