మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకుల సమ్మె

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పిలుపునిచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా త్వరలో 2 పీఎస్బీలను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం విదితమే. దీనిని వ్యతిరేకించాలని మంగళవారం యూఎఫ్బీయూ సమావేశంలో నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు.