ముంబయి: ఐసీయూలో అగ్ని ప్రమాదం- పది మంది నవజాత శిశువుల మృతి

ముంబయి: మహారాష్ట్రలో ఐసీయూలో మంటలు చెలరేగి పది మంది నవజాత శిశువులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన భండారా జిల్లా జనరల్ హాస్పిటల్‌లో జరిగింది. సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ) శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్ సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండతే పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.