ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసిపోయింది. అయితే, పోలింగ్ సమయం ముగిసేటప్పటికి ఇంకా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి తెలంగాణలోని రెండు స్థానాల్లోనూ పోలింగ్ 50 శాతానికి మించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని వారు చెబుతున్నారు.