మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేదు అనుభవం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టిఆర్‌ఎస్‌ నేతలు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదివారం ఉదయం చెర్లపల్లి డివిజన్‌కు వెళ్లగా.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

ఈ రోజు ఉదయం చర్లపల్లి డివిజన్‌లో వరద సాయం పంపిణీకి మేయర్‌ బంతు రామ్మోహన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు మేయర్‌ను నిలదీశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా ? తమ డివిజన్‌లో అభివఅద్ధి పనులు ఎందుకు చేయలేదు ? అంటూ కాలనీ వాసులంతా మేయర్‌ ను ప్రశ్నించారు. వరద సాయం కూడా తమకు సరిగ్గా అందలేదని కాలనీవాసులంతా మేయర్‌ తో చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.