మే 17 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు?

హైద‌రాబాద్ : 9వ త‌ర‌గ‌తి నుంచి ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంబించ‌నున్నారు. అయితే మే 17వ తేదీ నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌ను పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి పంపిన‌ట్లు తెలుస్తోంది. టెన్త్ ప‌రీక్ష‌లు మే 26వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఆ మ‌రుస‌టి రోజు నుంచి జూన్ 13వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఆరు ప‌రీక్ష‌లే ఉండే అవ‌కాశం
గ‌తంలో ఆరు స‌బ్జెక్టుల‌కు 11 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. కానీ ఈసారి కేవ‌లం ఆరు స‌బ్జెక్టుల‌కు ఆరు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌) టెస్టుల‌కు గానూ రెండు ఎఫ్ఏ టెస్టుల‌ను మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.