మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం!

హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు ఇలా అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
మోత్కుపల్లి నరసింహులు ఇటీవలనే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పటినుంచి మోత్కుపల్లి నర్సింహులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వల్ప అనారోగ్యం కలగడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.