మ‌ద్యం తాగి వేధిస్తున్న భ‌ర్త.. గొంతుకోసి చంపిన భార్య‌

నోయిడా: ప‌్ర‌తి రోజు పూటుగా తాగివ‌చ్చి భార్యా పిల్ల‌ల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్న పారిశుధ్య‌కార్మికుడిపై.. విసిగి వేసారిన ఆమె త‌న ఇద్ద‌రు పిల్ల‌లో క‌లిసి అత‌న్ని చంపేసింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని అనిల్ కుమార్ అనే వ్య‌క్తి పారిశుద్ధ్య కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. అత‌నికి భార్య పికా దేవి, ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్లు ఉన్నారు. ప్ర‌తిరోజు మ‌ద్యం తాగివ‌చ్చి వారిని వేధిస్తున్నాడు. దీంతో ఓపిక న‌శించిన‌వారు గురువారం రాత్రి అత‌న్ని గొంతుకోసి చంపేశారు. అన‌త‌రం తీసుకువెళ్లి స‌మీపంలోని ఓ పార్కులో ప‌డేశారు. శుక్ర‌వారం ఉద‌యం స్థానికులు అత‌ని మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు జ‌రిపారు. అత‌ని వేధింపులు, వికృత చేష్ట‌ల‌కు భ‌రించ‌లేక తామే చంపామ‌ని వారు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.