యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
యాదాద్రి: ఇవాళ మంగళవారం.. అలాగే గణతంత్ర దినం.. సెలవురోజు కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో భక్తులు పొటెత్తారు. భక్తుల రద్దీతో యాదాద్రి కిటకిటలాడింది. దర్శనం కోసం భక్తులు గంటల కొద్దీ క్యూ కట్టారు. నారసింహుడి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట పడుతుందని భక్తులు చెబుతున్నారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైనది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. అలాగే కొండకింద తులసీవనంలో గల శిల్పారామంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.