యుపిలో ట్ర‌క్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

ల‌క్నో: యుపిలోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్లిన కారు అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. సరియా గ్రామంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మృతులు డియోరియా జిల్లాకు చెందిన‌ అమృద్దిన్ (25), అర్మాన్ (27), అఫ్జ‌న్ (21), రియాజ్ (28), మ‌హ‌మ్మ‌ద్ (45) గా గుర్తించారు. అమృద్దిన్‌, ఆర్మాన్ ఇటీవ‌లే సౌదీ అరేబియా నుంచి భార‌త్‌కు వ‌చ్చార‌ని, మిగ‌తా ముగ్గురు ల‌క్నో నుంచి వ‌స్తూ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.