రష్యా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్

మాస్కో : రష్యా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వితో ప్రతి ఏడుగిరిలో ఒక వాలంటీర్‌కు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు రష్యా ఆరోగ్య మంత్రి మిఖిల్ మురాస్కో తెలిపారు. 40వేల వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా.. 300 మందిలో కొన్ని అనారోగ్యాలు బయటపడినట్లు వెల్లడించారు. 14 శాతం మందిలో బలహీనత, మరికొంతమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని అన్నారు. అయితే మరుసటి రోజు ఈ లక్షణాలు వారిలో కనిపించలేదని చెప్పారు. ఇటీవల లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఈ వ్యాక్సిన్ ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ప్రచురితమయ్యాయి. 21 రోజుల అనంతరం రెండో డోసును తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నామని మిఖిల్ చెప్పారు. కాగా, మాస్కోలో ఈ నెల పారంభంలో వ్యాక్సిన్ క్లినికల్ ప్ర యోగాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ అధికారుల అనుమతులు లభించిన అనంతరం భారత్‌లో కూడా ఈవ్యాక్సిన్ ప్రయోగాలను చేపడతామని ఆయన ప్రకటించారు.