రాజోలు: జనసేనకు 10 స్థానాలు.. రాపాకకు షాక్

రాజోలు: అసెంబ్లీ ఎన్నికలలో జనసేనకు జై కొట్టిన అక్కడి ప్రజలు పంచాయతి ఎన్నికల్లోనూ మద్దతు పలికారు. దీంతో జనసేన అక్కడ కీలక స్థానాలను గెలుచుకుంది. ఈ ప్రజా తీర్పుతో రాజోలులో రాపాకకు జనసైనికులు ఝలక్ ఇచ్చినట్లయింది. ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 10 స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి గెలిచిన రాపాక ఈ ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టారు. కానీ అనూహ్యంగా స్థానికులు పంచాయతీ ఎన్నికల్లోనూ జనసేనకు 10 స్థానాలు కట్టబెట్టారు.
పడమటిపాలెం, కేశవదాసుపాలెం, టెకిశెట్టిపాలెం, ఈటుకూరు, మేడిచర్ల పాలెం,కాట్రేనిపాడు,రామరాజులంక, కూనవరం, కత్తిమండ, బట్టేలంకలో జనసేన మద్దతుదారులు విజయఢంకా మోగించారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు పంచాయతీ పోరులోఊహించని షాక్ ఇచ్చారు. రాజోలులో గెలుపుతో ఇంటర్నెట్‌లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎమ్మెల్యే రాపాకను ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.