రాజ్యసభకు 9 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

లక్నో: యుపి నుంచి రాజ్యసభకు 10 మంది అభ్యర్థులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది బీజేపీ నుంచి పోటీలేకుండా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి కూడా బీజేపీ సీనియర్ నేత నరేష్ బన్సాల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూపీ నుంచి సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన చెరొకరు ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి హర్దీద్ సింగ్ పురి, అరుణ్ సింగ్, హరిద్వార్ డుబే, బ్రిజ్లాల్, నీరజ్ శేఖర్, గీతా శాక్య, సీమా ద్వివేది, బీఎల్ వర్మ ఉన్నారు. సమాజ్వాది పార్టీ నుంచి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్జీ గౌతమ్ సైతం పోటీలేకుండా పెద్దల సభకు ఎన్నికయ్యారు.