రాష్ట్రంలో చలి పులి

హైదరాబాద్ : ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల మంగళవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వచ్చే నాలుగు రోజుల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గవచ్చని వివరించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడి ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చలి తీవ్రత కొంత తగ్గింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఒకటి లేదా రెండు డిగ్రీలు మాత్రమే తక్కువగా నమోదయ్యాయి.