రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

హైదరాబాద్‌ : డాక్ట‌ర్ అవ్వాల‌నుకునే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మ‌రో 150 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్‌ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా ఈ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్‌ఐసీసహా మొత్తం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 18 ప్రైవేట్‌ కాలేజీల్లో 2,750, 4 మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.