రెజ్లింగ్ సెంటర్‌పై కాల్పులు.. ఐదుగురు మృతి

రోహతక్: హర్యానాలోని రోహతక్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతిచెందారు. పాత కక్షల నేపథ్యంలో రెజ్లింగ్ సెంటర్‌పై ఓ వ్యక్తి కాల్పుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళా రెజర్లు, కోచ్, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.