రెమెడిసివిర్ ఎగుమతిపై భారత్ నిషేధం

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో క‌రోనా పరిస్థితులు మెరుగుపడే వరకు రెమ్‌డెసివిర్ ఔషధం, ఇంజెక్షన్ ఎగుమతిపై నిషేధం విధించారు. ఈ మేర‌కు భారత ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఔషధ నిల్వల వివరాలను వెబ్‌సైట్‌ లో ఉంచాలని, రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ కు పోకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

“కొవిడ్‌ కేసుల ఇటీవ‌ల‌ భారతదేశం అంత‌టా పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్ 11 నాటికి 11.08 లక్షల పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్ కోసం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. రాబోయే రోజుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న‌ది ” అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశీయ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడే వరకూ రెమ్‌డెసివిర్‌ను ఔషధ తయారీ సంస్థలు ఎగుమతి చేయొద్దని పేర్కొంది. రోజు రోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. పంపిణీదారులు రెమ్‌డెసివిర్‌ నిల్వలు దాచొద్దు. ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచాలని రెమ్‌డెసివిర్‌ నిల్వలు నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకోవాలి. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు ఔషధ నిల్వలను నిత్యం తనిఖీ చేయాలని కేంద్రం ప్రకటనలో తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.