రేణిగుంటలో రైల్వే ట్రాక్‌పై పేలుడు కలకలం..

రేణిగుంట: చిత్తూరుజిల్లా రేణిగుంట పరిధిలోని తారకరామనగర్‌లోని రేణిగుంట – కడప మార్గంలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పశువులను కాస్తూ పట్టాలపైకి వచ్చిన శశికుమారి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఓ డబ్బా పేలి ఈ ఘటన జరిగినట్లు బాధిత మహిళ చెబుతోంది. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేటుడు పదార్థాన్ని పరీక్ష నిమిత్తం పంపామని నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేశారు.