రేపు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కరోనా ప్రభావంతో నష్టపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు సమీక్షకు హాజరుకున్నారు. శనివారం సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్‌ సమావేమయ్యే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.