రేపు కామారెడ్డిలో పర్యటించనున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి: జిల్లాలో (రేపు) శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఎప్పటినుంచో లబ్ధిదారులు ఎదురు చూస్తున్న డబల్ ఇళ్లను ప్రారంభించనున్నారు. అలాగే మరిన్నీ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రైతు వేదికలు, 40 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను రేపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో రైతు వేదిక, వైకుంఠధామం, లైబ్రరీ, చావడి, డ్వాక్రా సంఘ భవనం, పాఠశాల గదుల ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు బిక్కనూర్ మండల కేంద్రంలో రైతు వేదిక భవనం, మధ్యాహ్నం 12:30 కి జంగంపల్లి గ్రామంలో రైతు వేదిక, కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలో 2 కోట్ల 52 లక్షలతో నిర్మించిన 40 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడంతో పాటు రాజంపేట మండల కేంద్రంలో 2 కోట్ల 52 లక్షలతో నిర్మించనున్న డబల్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.