రైతులకు తోచిన సాయం చేయండి: ఢిల్లీ సీఎం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వందలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్న అన్నదాతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతాంగానికి తోచిన సాయం చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రైతుల డిమాండ్లపై సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని ఆయన కోరారు. చలికి సైతం వెనకడుగు వేయకుండా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు సాయం చేస్తున్నారని, ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేయాలని ఢిల్లీ సీఎం కోరారు.
ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రైతులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారికి ఆహారం, వైద్యం, తాగునీరు సహా ఆప్ వాలంటీర్లు, ఎమ్మెల్యే తమకు సాధ్యమైన సాయం చేస్తున్నారు. పోరాటం చేస్తున్న రైతులకు ఢిల్లీ ప్రజలంతా సాయం చేసి అదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
साहिब श्री गुरु नानक देव जी ने हमें मानव सेवा की सीख दी थी, उनके उपदेश का पालन करते हुए हमें अपने अन्नदाताओं की भी सेवा करनी है जो अपने हक़ की लड़ाई लड़ रहे हैं
सभी दिल्लीवासियों से मेरी अपील है कि दिल्ली आए किसान भाईयों की खूब सेवा करें। pic.twitter.com/aysjNLLRpx
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 30, 2020