రైతుల ఆవేదనను వినాలి : రాహుల్
ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను వినాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనకు మట్టిలోని ప్రతి రేణువు ప్రతిస్పందిస్తోందని.. బిజెపి ప్రభుత్వం సైతం వినాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌధురితో కలిసి రాహుల్‌గాంధీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే.