రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆదిలాబాద్ః దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జడ్పి సమావేశ మందిరంలో సీసీఐ పత్తి కొనుగోలు సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 19 న ఆదిలాబాద్ లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలును ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి స్వయంగా ఓ రైతు అయినందున రైతు సమస్యలు ఆయనకు తెలుసన్నారు..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఆదిలాబాద్ లోనే పత్తి దిగుబడి ఎక్కువ ఉన్నందున ఆదిలాబాద్ లోనే ముందుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థ సీసీ ఐ కి అమ్ముకోవాలని సూచించారు. సీసీ ఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుండి 12 శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేస్తుందని వివరించారు తేమ శాతం సడలింపు విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు..ఈ సమావేశంలో జడ్పి చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రెఖా నాయక్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డైరీ చైర్మన్ లోక భూమా రెడ్డి, సీసీ ఐ అధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లు రైతులు, పాల్గొన్నారు.