రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

జోగులాంబ గద్వాల: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యూటీకి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ మరణించారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లిలో ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొనడంతో బైక్‌పై డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ అక్కడిక్కడే మృతిచెందారు. శంకర్‌గౌడ్ రాజోలి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.