రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.