లీడింగ్‌లో తేజస్వియాదవ్

పాట్నా: దేశమొత్తం ఉత్కంఠగా గమనిస్తోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అన్నీతానై నడిపించిన.. ఆర్జేడీ నేత, మహాఘట్బందన్ సీఎం అభ్యర్థి తేజస్వియాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. రఘోపూర్ నుంచి పోటీ చేశారు తేజస్వి యాదవ్.. ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. ఇక, కౌంటింగ్‌లో ఆర్జేడీ మిత్రపక్షాల హవా కొనసాగుతోంది. కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాఘట్బందన్కే పట్టం కట్టాయి. మరోవైపు.. మాజీ సీఎం జితన్ రాం మాంజీ, తేజ్‌ప్రతాప్ యాదవ్, సుభాషిణి శరద్ యాదవ్ కూడా లీడింగ్‌లో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ ఈసారి హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం జితన్ రాం మాంజీ, తేజ్‌ప్రతాప్ యాదవ్, సుభాషిణి శరద్ యాదవ్ కూడా లీడింగ్‌లో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ ఈసారి హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. వైశాలి జిల్లాలోని మహువా అసెంబ్లీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తేజ్‌ప్రతాప్.. ఈసారి హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. జనతాదళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్ నుంచి తేజ్ ప్రతాప్‌కు గట్టి పోటీ ఉంటుంది.