వనదుర్గకు పట్టువస్త్రాలు సమర్పించిన హరీశ్‌రావు
మెదక్: తెలంగాణలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం వనదుర్గ భవానీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేకువ జాము నుంచే భక్తులు మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఉదయం 4 గంటల నుంచే భక్తులను అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏడుపాయలలో మూడు రోజుల పాటు జాతర జరుగడం ఆనవాయితీగా వస్తోంది.