వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ః నగరంలో గత రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన 24,47వ డివిజన్ లోని ప్రాంతంలో పర్యటించి స్థానిక పరిస్థితులను ముంపునకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని పరిశీలించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ . మంత్రితోతో పాటు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాష్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతీ ఇతర అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు. ముంపునకు గల కారణాలను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్థానిక ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రజలందరూ సహకరించాలని, ప్రజా ప్రయోజనాలకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వరంగల్ నగరం అంటే అత్యంత ప్రేమ ఉందని, ఈ నగరం అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వరంగల్ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇటీవల వరంగల్ నగరం ముంపునకు గురైనప్పుడు మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ గారిని పంపించి పర్యవేక్షణ చేయించారని, భవిష్యత్తులో ముంపు సమస్య లేకుండా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు.