వాళ్లంతా వెంటనే హైదరాబాద్ విడిచి వెళ్లాలి: ఎస్ఈసీ

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్లపాటు జైలుశిక్ష, జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసి) పార్థసారథి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిపిలివేశాయి. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఎస్ ఈసి మీడియాతో మాట్లాడారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జిహెచ్ ఎంసి పరిధి దాటి వెళ్లాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లి పోవాలని సూచించిన ఎన్నికల సంఘం… పోటీ చేస్తున్న వ్యక్తికి ఒకే వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏజెంట్లకు ప్రత్యేకంగా వాహనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి వాహనంలోనే ఏజెంట్లు ప్రయాణం చేయొచ్చని సూచించింది. మరోవైపు.. ఇవాళ సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు క్లోజ్ కాగా.. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది ఈసీ… ఇక, ఓటు వేయడానికి వెళ్లే వాళ్లకు అన్ని సంస్థలు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్.